WA Notify గోప్యతా విధానం

ఈ గోప్యతా పాలసీ వాషింగ్టన్ రాష్ట్రం కొరకు అధికారిక ఎక్స్​ప్లోజర్ నోటిఫికేషన్ టెక్నాలజీ అయిన WA Notify(డబ్ల్యుఎ నోటిఫై), the official exposure notification technology for Washington State. వాషింగ్టన్ రాష్ట్రం Department of Health (DOH, డిపార్ట్​మెంట్ ఆఫ్ హెల్త్) పర్యవేక్షణ మరియు ఎండార్స్​మెంట్​తో WA Notify రూపొందించబడింది.

మేము ఏ సమాచారాన్ని సేకరించి, ఉపయోగించుకుంటాము?

WA Notify లో దిగువ సమాచారాన్ని సేకరించవచ్చు:

  • WA Notify డౌన్​లోడ్ చేయడం లేదా ఎనేబుల్ చేయడం
  • ఎక్స్​ప్లోజర్ నోటిఫికేషన్ అందుకోవడం.
  • ధృవీకరణ కోడ్ లేదా ధృవీకరణ లింక్​ని సబ్మిట్ చేయడం
  • ఇతరులకు నోటిఫై చేయడానికి ఎంచుకున్న పాజిటివ్ యూజర్​ల కొరకు యాదృచ్ఛిక కోడ్​లను అప్​లోడ్ చేయడం

WA Notify ఏవిధంగా ఉపయోగించబడుతుందని అర్థం చేసుకోవడానికి వాషింగ్టన్ రాష్ట్రం Department of Health (DOH, డిపార్ట్​మెంట్ ఆఫ్ హెల్త్) పై ఈవెంట్ సమాచారాన్ని ఉపయోగించుకుంటుంది. ఈ డేటా DOH, ప్రభుత్వ ఆరోగ్య సంస్థలులేదా అధీకృత వైద్య అధికారులతో పంచుకోవచ్చు. గణాంక లేదా శాస్త్రీయ పరిశోధన అధ్యయనం కొరకు దానిని ఒక సంగ్రహ రూపంలో కూడా ఉపయోగించవచ్చు. ఈ సమాచారంలో ఎలాంటి వ్యక్తిగత లేదా లొకేషన్ సమాచారం ఉండదు లేదా ఎవరైనా WA Notify యూజర్​ని గుర్తించడానికి ఉపయోగించబడదు.

Google మరియు Apple యొక్క ఇంటెంట్​తో అలైన్ చేయడానికి WA Notify యూజర్ గోప్యతకు సంరక్షించడానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ డిజైన్ చేయబడింది WA Notify ఈ డేటా ఎలిమెంట్​లను జనరేట్ చేస్తుంది, దీనిలో మిమ్మల్ని గుర్తించే ఎలాంటి డేటా ఉండదు

గుర్తుతెలియని సంకేతాలు

  • WA Notify యొక్క యూజర్​లు ఒకరినొకరు దగ్గరగా ఉన్నప్పుడు వారి స్మార్ట్​ఫోన్​ల మధ్య బ్లూటూత్ ద్వారా యాదృచ్ఛిక కోడ్​లు పంచుకోబడతాయి.
  • గుర్తుతెలియని సంకేతాలు WA Notify ద్వారాగాక, మీ స్మార్ట్​ఫోన్ ద్వారానే ఉత్పన్నమై, అందులోనే నిల్వ చేసి ఉంటాయి.
  • WA Notify ని అనుమతించడానికి, మీ కోవిడ్-19కు ఎక్స్​పోజర్​లకు అవకాశం ఉన్న వారిని తనిఖీ చేయడానికి మాత్రమే వాడటం జరుగుతుంది.
  • గుర్తుతెలియని సంకేతాలను గరిష్టంగా 14 రోజుల పాటు నిల్వ చేస్తారు.

ధృవీకరణ కోడ్​లు మరియు లింక్​లు

  • మీరు కొవిడ్-19కు పాజిటివ్​గా టెస్ట్ చేయబడితే, మీ స్థానిక ప్రజారోగ్య అధికారులు మిమ్మల్ని సంప్రదిస్తే, మీరు WA Notify ఉపయోగిస్తున్నారా అని వారు అడుగుతారు. మీరు ఉన్నట్లయితే, మీరు WA Notify లోనికి ప్రవేశించడానికి వారు ధృవీకరణ కోడ్ లేదా లింక్​ని అందిస్తారు.
  • ఇటీవల కొవిడ్-19కు పాజిటివ్​గా టెస్ట్ చేయబడ్డ ప్రతి ఒక్కరికి DOH ప్రతి ఒక్కరికి పాప్ అప్ నోటిఫికేషన్ మరియు/లేదా ధృవీకరణ లింక్​తో టెక్ట్స్ సందేశాన్ని పంపుతుంది, తద్వారా WA Notify యూజర్​లు సంభావ్య ఎక్స్​ప్లోజర్ గురించి ఇతర యూజర్​లను వేగంగా మరియు అనామధేయంగా అలర్ట్ చేయవచ్చు.
    • నోటిఫికేషన్ మీద తట్టడం లేదా మీ ధృవీకరణ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మీ యాదృచ్ఛిక కోడ్​లను పంచుకునేందుకు అనుమతించబడుతుంది తద్వారా మీకు దగ్గరగా ఉండే ఇతర WA Notify యూజర్​లు బహిర్గతమయ్యే అవకాశం ఉండవచ్చని అజ్ఞాతంగా హెచ్చరిస్తారు.
    • WA Notify ఎవరు ఉపయోగిస్తున్నారనేది మాకు తెలియదు కనుక కొవిడ్-19 కొరకు పాజిటివ్​గా టెస్ట్ కాబడిన ప్తరి ఒక్కరికి DOH ధృవీకరణ లింక్​తో టెక్ట్స్ సందేశాన్ని పంపుతుంది. ఒకవేళ మీరు WA Notify ఉపయోగించనట్లయితే, మీరు టెక్ట్స్​ని విస్మరించవచ్చు.
    • ఇతర WA Notify యూజర్​​లను అనామధేయంగా అలర్ట్ చేయడానికి మీరు నోటిఫికేషన్ మీద లేదా ధృవీకరణ లింక్ మీద క్లిక్ చేయాలని నిర్ణయించుకోవచ్చు.

ఉపయోగపు లాగ్​లు

  • దాదాపుగా ఏ యాప్​లేదా ఇంటర్నెట్ సేవ అయినా చేసే విధంగానే, WA Notify కూడా మీరు ఆ సేవను ఉపయోగించినప్పుడు ఆటోమేటిక్​గా లాగ్​లను ఉత్పత్తి చేస్తుంది. ఈ లాగ్​లలో మీ స్మార్ట్​ఫోన్​కు సంబంధించిన కొంత సమాచారం ఉంటుంది. మేము ఈ సమాచారాన్ని WA Notify కి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగిస్తాము.
  • ఈ లాగ్​ల్లో యాదృచ్ఛిక కోడ్​లు లేదా ధృవీకరణ లింక్​లు లేదా కోడ్​లు చేర్చబడవు మరియు మీకు లేదా మీ స్మార్ట్ ఫోన్​కు కోడ్ యొక్క ఏ రకాన్ని తిరిగి జతచేయడానికి ఉపయోగించలేం.
  • ఈ లాగ్​లు ఉత్పన్నమైన 14 రోజుల తరువాత వాటికవే తొలగిపోతాయి.

డేటా విశ్లేషణ

  • ఎక్స్​ట్రా ఎనలిటిక్స్​ని ప్రారంభించడానికి మీరు ఎంచుకున్నట్లయితే, యాప్​ని మెరుగుపరచడానికి సాయపడేందుకు DOH తో పరిమితంగా సమగ్రమైన డేటా పంచుకోబడుతుంది.
  • ఈ డేటాలో ఈ యాప్​ను ఎలా ఉపయోగించడం జరిగిందనే దానికి సంబంధించిన గణాంకాలు ఉంటాయి. మిమ్మల్ని గుర్తించడానికి ఉపయోగపడగల సమాచారం ఏదీ ఇందులో ఉండదు.
  • యాప్​లోని ఎనలిటిక్స్ షేరింగ్​ను నిలిపి వేయడం ద్వారా మీరు ఈ డేటాను షేర్ చేయకూడదని ఎంచుకోవచ్చు.

డిజైన్ రీత్యానే, WA Notify మీ స్మార్ట్​ఫోన్ నుండి లొకేషన్ డేటాను సేకరించదు, గుర్తుతెలియని సంకేతాలు లేదా ధృవీకరణ సంఖ్యలతో మిమ్మల్ని లేదా మీ స్మార్ట్​ఫోన్​ను ముడిపెట్టే సమాచారాన్నిదేనినీ సేకరించదు లేదా షేర్ చేయదు.

మీరు ధృవీకరణ కోడ్ అభ్యర్ధించినప్పుడు ఏమి జరుగుతుంది:

కౌంటర్​లో కొనుగోలు చేసిన గృహ కొవిడ్-19 టెస్ట్​లో పాజిటివ్ అయిన WA Notify యూజర్​లుసంభావ్య ఎక్స్​ప్లోజర్ గురించి ఇతర WA Notify యూజర్​లను అలర్ట్​ను అనామధేయంగా అలర్ట్ చేయడానికి WA Notify లో ధృవీకరణ కోడ్​ని అభ్యర్ధించవచ్చు. ధృవీకరణ కోడ్ అందుకోవడానికి, WA Notify యూజర్​లు వారి పాజిటివ్ టెస్ట్ ఫలితం తేదీని మరియు వారి మొబైల్ నెంబరును విధిగా నమోదు చేయాలి. సంభావ్య ఎక్స్​ప్లోజర్ గురించి ఇతర WA Notify యూజర్​లను అనామధేయంగా అలర్ట్ చేయడానికి ధృవీకరణ కోడ్ నమోదు చేయడానికి లేదా ధృవీకరణ లింక్ మీద క్లిక్ చేయడానికి, కోడ్ అభ్యర్ధించిన అదే పరికరాన్ని ఉపయోగించాలి.

ఒకే టెస్ట్ ఫలితం యొక్క డూప్లికేట్ రిపోర్ట్​లను నిరోధించడానికి 90 రోజుల వరకు కోడ్​ని అభ్యర్ధించడానికి ఉపయోగించే ఫోన్ నెంబరు యొక్క క్రిప్టోగ్రాఫికల్​గా సంరక్షించబడ్డ వెర్షన్​ని WA Notify తాత్కాలికంగా నిల్వ చేస్తుంది. ఈ సమాచారంలో ఎలాంటి వ్యక్తిగత లేదా లొకేషన్ సమాచారం చేర్చబడదు లేదా ఎవరైనా WA Notify యూజర్​ని గుర్తించడానికి ఉపయోగించబడదు.

మేము మీ సమాచారాన్ని ఎప్పుడు షేర్ చేస్తాము?

మీరు ధృవీకరణ కోడ్ నమోదు చేయడం లేదా ధృవీకరణ లింక్ క్లిక్ చేయాలని ఎంచుకుంటే తప్ప, మేం మీ సమాచారాన్ని స్వచ్ఛందంగా సేకరించం లేదా మరెవరితోనైనా పంచుకోం. మీరు అలా చేస్తే, WA Notify మీ గుర్తుతెలియని సంకేతాలను మీ స్మార్ట్​ఫోన్​కు దగ్గరలో ఉన్న ఇతర స్మార్ట్​ఫోన్​లతో షేర్ చేసుకుంటుంది. మీ స్మార్ట్​ఫోన్​కు యాక్సెస్​లేని ఎవరి ద్వారానైనా ధృవీకరణ కోడ్ లేదా లింక్​ని తిరిగి మీకు లింక్ చేయలేరు. WA Notify లో ఏ సమాచారం సేకరించబడుతుంది మరియు ఉపయోగించబడుతుందనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి, దయచేసి ఈ పేజీ పైన ఉన్న మేం ఏ సమాచారాన్ని సేకరిస్తాం మరియు ఉపయోగిస్తాం సెక్షన్ సమీక్షించండి

మేము మీ సమాచారాన్ని ఎలా పరిరక్షిస్తాము?

Google మరియు Apple యొక్క ఎక్స్​ప్లోజర్ నోటిఫికేషన్ ఫ్రేమ్​వర్క్ ఉపయోగించి WA Notify యాదృచ్ఛిక కోడ్​లను సంరక్షిస్తుంది, దీనిలో వాటిని ఎలా ఎన్​క్రిప్ట్ చేయాలి మరియు బదిలీ చేయాలనే దాని గురించి అత్యంత నిర్ధిష్టమైన ఆవశ్యకతలు చేర్చబడతాయి. WA Notify మీ గుర్తుతెలియని సంకేతాలను నిల్వ చేయదు లేదా ఉత్పత్తి చేయదు – ఆ పని మీ స్మార్ట్​ఫోన్ చేస్తుంది.

మీ సమాచారంపై హక్కులు మీవే

ధృవీకరణ కోడ్​లు మరియు అప్లికేషన్​లాగ్​లను మీ స్మార్ట్​ఫోన్​కు యాక్సెస్ చేయకుండా జతచేయలేం కాబట్టి, DOH ఏవిధంగానూ ఈ సమాచారాన్ని యాక్సెస్ చేసుకోలేదు. దీని కారణంగా, DOH మీరు ఈ సమాచారాన్ని అడిగితే మీకు ఇవ్వలేకపోచ్చు లేదా డిలీట్ చేయలేకపోవచ్చు. WA Notify ఉపయోగాన్నినియంత్రించే వారు మీరే. ఎక్స్​పోజర్ నోటిఫికేషన్​లను నిలిపివేయడానికి లేదా మీ స్మార్ట్​ఫోన్​లో నిల్వ చేసిన ఎక్స్​పోజర్ లాగ్​లను ఎప్పుడైనా తొలగించడానికి మీ స్మార్ట్​ఫోన్ మిమ్మల్ని అనుమతిస్తుంది. అదనంగా, WA Notify ని మీరు ఎప్పుడైనా అన్​ఇన్​స్టాల్ చేయవచ్చు. మీరు అలా చేస్తే, నిల్వ చేసిన గుర్తుతెలియని సంకేతాలన్నీ తొలగిపోతాయి.